బాలికలకు సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం

బాలికలకు సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం

కృష్ణా: జిల్లాలో బాలబాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ “బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష” కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డులోని మండల ప్రాథమిక పాఠశాలలో DMHO, ఆర్బీఎస్‌కే అధికారి డా. హిమబిందు స్వయంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారన్నారు.