VIDEO: కల్లూరు ఆశ్రమ పాఠశాల పరిసరాలు క్లీనింగ్

KMM: కల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటీవల విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాఠశాలను శుభ్రపరచాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్ సూచించడంతో ఇవాళ కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు నరసింహారావు పనులు ప్రారంభించారు. జేసీబీతో పాఠశాల ఆవరణ, కాంపౌండ్ వాల్ చుట్టూ, పరిసరాలను శుభ్రం చేయించారు.