'HIT TV' కథనానికి స్పందన

'HIT TV' కథనానికి స్పందన

గుంటూరులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహానికి జరిగిన అవమానంపై 'HIT TV'లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. BR స్టేడియం వద్ద ఆయన విగ్రహానికి బైండింగ్ వైర్లు కట్టి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ ఫ్లెక్సీని, వైర్లను తొలగించారు. ఈ దుర్ఘటనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.