ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి: ఎస్పీ
అన్నమయ్య: ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. మదనపల్లిలో జరిగిన సమీక్షలో నిందితులకు శిక్ష పడేలా బలమైన సాక్ష్యాలు సేకరించాలని, చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని సూచించారు. పరారీలో ఉన్న నిందితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని తెలిపారు.