VIDEO: 15 హామీలతో బాండ్ పేపర్

VIDEO: 15 హామీలతో బాండ్ పేపర్

మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దుగ్యాల బాపు వినూత్న ప్రచారంతో ముందుకు వచ్చాడు. 15 హామీలను బాండ్ పేపర్‌లో నమోదు చేసి ప్రజలకు చూపిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాడు. గెలిస్తే ఆడపిల్లల పెళ్లికి 25 కేజీల బియ్యం, అత్యవసర శస్త్రచికిత్సలకు రూ. 10,000 సహాయం అందిస్తానని తెలిపాడు. హామీలు నెరవేర్చకపోతే తన 2 ఎకరాల భూమిని గ్రామ పంచాయతీకి రాస్తానని ప్రకటించాడు.