'పాపంపేట భూవివాదానికి శాశ్వత పరిష్కారం'
ATP: అనంతపురం రూరల్ మండలం పాపంపేట భూవివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేద్దామని పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. తమ క్యాంప్ కార్యాలయంలో భూవివాద బాధితులు, స్థానిక పెద్దలతో వారు సమావేశమయ్యారు. స్థలాలు, నివాస గృహాలు వారికే చెందేలా శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని శ్రీరామ్ స్పష్టమైన హామీ ఇచ్చారు.