పేకాట శిబిరంపై పోలీసుల దాడి
ELR: జూద క్రీడపై దాడి జరిపి 15 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. పొంగుటూరు సమీపంలోని పేకాట శిబిరంపై శనివారం అర్ధరాత్రి సిబ్బందితో కలిసి దాడి చేయగా 17 వేల రూపాయల నగదు, 7 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జూద క్రీడల నిర్వహణపై పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలకు ఆయన సూచించారు.