VIDEO: పాముకాటుతో వివాహిత మృతి
SKLM: నరసన్నపేట మండలం బొరిగివలస పంచాయతీలో వివాహిత పాము కాటుకు గురి అయి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం చోడి పంట కోతకు వెళ్లిన ఇప్పిలి నీలవేణి (27) పాము కాటుతో అస్వస్థతకు గురి అయింది. స్థానికులు ఆమెను హుటాహుటిన ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.