'జగన్ పర్యటనకు అనవసర ఆంక్షలు'

నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి జగన్ జిల్లాకు వస్తున్న సందర్భంలో పోలీసులు అనవసర ఆంక్షలు విధించారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మైనింగ్ కేసులో తనపై కూడా కేసు పెడతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.