VIDEO: గ్రామంలో తేనెటీగల దాడి

VIDEO: గ్రామంలో తేనెటీగల దాడి

SRD: సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తేనెటీగలు శుక్రవారం బీభత్సం సృష్టించాయి. ఒకేసారి 15 మందిపై తేనెటీగలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో సదాశివపేటలోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితులకు చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.