VIDEO: తిరుమలలో భక్తులకు చాక్లెట్లు పంచిన రాష్ట్రపతి
TPT: తిరుమలలో శ్రీవారి భక్తులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆప్యాయంగా పలకరించారు. దర్శనం ముగిసిన తర్వాత ఆమె రాంభగీచ బస్టాండ్ వైపు వచ్చారు. ఆ సమయంలో భక్తులను ఆపేశారు. ఇది గమనించిన రాష్ట్రపతి కారు దిగి భక్తుల వద్దకు వెళ్లారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆ తర్వాత చాక్లెట్లు పంచారు. రాష్ట్రపతే స్వయంగా భక్తుల దగ్గరకు వచ్చి మాట్లాడటంపై ప్రశంసలు వస్తున్నాయి.