మిర్యాలగూడలో జయశంకర్ విగ్రహానికి వినతి
NLG: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలల యజమానులు, అధ్యాపకులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. వారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందించారు. స్కాలర్షిప్ ఆలస్యమవడం వల్ల అనేక విద్యాసంస్థలు మూతపడ్డాయని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు.