'పూర్వపు కలెక్టర్ సంతోష్ సహకారం మరువలేనిది'
GDWL: జిల్లా అభివృద్ధిలో పూర్వపు కలెక్టర్ సంతోష్ సహకారం మరువలేనిదని ఎస్పీ శ్రీనివాసరావు ప్రశంసించారు. గద్వాల నుంచి బదిలీపై వెళ్లిన ఆయనకు శనివారం కలెక్టరేట్‌లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లారని తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు.