అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
KRNL: ఆదోని పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే పార్థసారథి, కౌన్సిలర్ చలపతితో కలిసి భూమి పూజ చేశారు. 15వ ఫైనాన్స్ నిధులతో సీసీ రోడ్డు కోసం రూ. 9 లక్షలు, డ్రైనేజ్‌కు రూ. 3 లక్షలు, తాగునీటి పైపుల ఏర్పాటుకు రూ. 3.5 లక్షలతో పనులు ప్రారంభించారు. ఆదోని అభివృద్ధికి రాజకీయాలకతీతంగా అందరూ సహకరించాలని ఎమ్మెల్యే వెల్లడించారు.