జనసేన పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

జనసేన పార్టీ కార్యాలయంలో  రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

TPT: నాయుడుపేట పట్టణంలోని బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడుపేట ఏఎంసీ ఛైర్మన్, జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇంఛా‌ర్జి ఉయ్యాల ప్రవీణ్ స్థానిక నాయకులతో కలిసి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.