రహదారిని ప్రారంభించిన మంత్రి
SKLM: రామలక్ష్మణ కూడలి నుంచి పెద్దపాడు జంక్షన్ వరకు ప్లాంటేషన్, సెంట్రల్ లైటింగ్, ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన నూతన రహదారిని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ కలిసి ప్రారంభించారు. రూ. 3.68 కోట్ల సుడా నిధులతో ఈ రహదారిని సుందరీకరించడంతో పాటు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, నగరానికి మరింత అందాన్ని తీసుకువచ్చినట్లు నేతలు తెలిపారు.