ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం
బాపట్ల: 15వ వార్డు శృంగారపురంలో విద్యుత్ స్తంభం పైభాగం విరిగిపోయింది. గండి కమలాకర్ ఇంటి వద్ద ఇది ఉంది. పక్కనే ఉన్న వేపచెట్టు తగిలి గాలికి స్తంభం బాగా కదులుతోంది. ఏ క్షణమైనా నేలకొరిగే ప్రమాదం ఉంది. అకాల వర్షాలకు పెను ముప్పు తప్పదని స్థానికులు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విరిగిన స్తంభాన్ని తొలగించాలని కోరుతున్నారు.