ఎమ్మెల్యే సామేలు చేతుల మీదుగా సీడీ ఆవిష్కరణ

SRPT: తుంగతుర్తి మండలం గానుగుబండకి చెందిన కాంగ్రెస్ నాయకులు రుద్ర రామచంద్రు సహకారంతో ఎమ్మెల్యే సామేలుపై రాచకొండ రంగన్న రాసిన పాటల సీడీని ఆదివారం ఎమ్మెల్యే సామేలు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గాయకులు పోలెపాక నవీన్, కాంగ్రెస్ నాయకులు రామచంద్రు, సుదర్శన్, అంజయ్య, వేణు, సంతోష్, ముత్తయ్య, అనిల్ పాల్గొన్నారు.