రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచనలు

రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచనలు

MBNR: పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని జిల్లా ఎస్పీ జానకి ధరావత్ హెచ్చరించారు. అతి వేగంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్లపై కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని గమనించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలు పోసి వాటిపై నల్ల కవర్లు కప్పడంతో రాత్రి సమయంలో అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.