VIDEO: మేర్లపాక దళితవాడ సమీపంలో రోడ్డు ప్రమాదం
TPT: మేర్లపాక దళితవాడ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళుతున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనలో కారులో ఉన్న చిట్టిగుంట సురేశ్ తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.