ఉంగుటూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఉంగుటూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కృష్ణా: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉంగుటూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రధాన అతిథి మండల పరిషత్ అధ్యక్షురాలు వడ్లమూడి సరోజినీ జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు. మరోవైపు పెద్ద అవుటపల్లి, తుట్టకుంట, తేలప్రోలు, ఆత్మకూరు, నందమూరు, ఇందుపల్లి తదితర గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేశారు.