రైతు బజార్లలో భారీగా పడిపోయిన ధరలు
SDPT: సిద్దిపేట రైతు మార్కెట్లో గత వారం రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా తగ్గాయి. టమాటా కిలో రూ.10, చిక్కుడుకాయ రూ.10కే లభిస్తున్నాయి. బెండకాయ, కాకరకాయ ధరలు కిలో రూ.30గా ఉన్నాయని రైతులు తెలిపారు. దిగుబడి పెరగడంతో ఈ ధరలు అందుబాటులోకి వచ్చాయన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని వారు పేర్కొన్నారు.