కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
MHBD: రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మంచి ధర పొందాలని MLA భూక్య మురళి నాయక్ సూచించారు. పట్టణంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని MLA శుక్రవారం ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనాలని కోరారు. మార్కెట్ ఛైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జ్యోతి-రమేష్, తదితరులున్నారు.