నార్పలలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం
ATP: నార్పల మండల కేంద్రంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కడపం దామోదర్ ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. అంత్యోదయ సిద్ధాంతంతో సమాజంలోని చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందించడమే పార్టీ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని కొనియాడారు.