ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

GDWL: గద్వాల ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు మంగళవారం మండల పరిధిలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్‌ను గౌరవించాలని, అవగాహనతోనే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలుశిక్ష విధించబడుతుందని హెచ్చరించారు.