మున్నాళ్లకే ఎగిరిపోయిన రోడ్డు ప్యాచ్ వర్క్
KMR: పద్మాజీ వాడి చౌరస్తా నుంచి బాన్సువాడకు వెళ్లే రహదారిపై ప్యాచ్ వర్క్‌ను తూతూ మంత్రంగా వేశారు. దీంతో మూన్నాళ్లకే ప్యాచ్ వర్క్ చెదిరిపోయి రోడ్డు యధావిధిగా గుంతలమయమైంది. ఈ రోడ్డును కాంట్రాక్టర్లు వేసిన తీరుకు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా రోడ్డుపైన తార్ వేసి బాగచేయాలని కోరుతున్నారు.