మరో కొత్త వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి
AP: తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదానికి తెరలేపారు. విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును లక్ష్యంగా చేసుకుని వాట్సాప్‌లో ఆయన స్టేటస్‌లు పెట్టారు. 'నువ్వు దేనికి అధ్యక్షుడివి? జూదం క్లబ్‌కా? జూదం కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్' అని పేర్కొన్నారు. చాలా కాలంగా సుబ్బారావు జూదం ఆడిస్తున్నారని కొలికపూడి ఆరోపిస్తున్నారు.