ఆటో బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు

ఆటో బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు

SKLM: లగేజ్ ఆటో బోల్తా పడి బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పాతపట్నం మండలం కొరసవాడ రహదారిలో ఆదివారం జరిగింది. చోదకుడి పక్కన కూర్చొని ఉన్న బాలుడు లోపింటి భరత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.