రెండు ఐచర్ వాహనాలు ఢీ

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున మద్యం లోడుతో భైంసా నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న అదేవిధంగా మామిడి పండ్ల లోడుతో భైంసా వైపు వస్తున్న ఐచర్ వాహనాలు ఢీకొన్నాయి. ఐచర్ వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.