ఎస్ఎఫ్ఐ నాయకుల భిక్షాటన

ఎస్ఎఫ్ఐ నాయకుల భిక్షాటన

SRCL: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో శనివారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.