‘సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తాం’

‘సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తాం’

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాకిస్తాన్ స్పందించింది. పాక్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ, సింధూ జలాలను మళ్లించడానికి భారత్ ఎలాంటి నిర్మాణం చేపట్టినా దానిని పేల్చివేస్తామని హెచ్చరించారు. కాగా, ఆయన వ్యాఖ్యలు యుద్ధోన్మాదాన్ని పెంచేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.