'వృథాగా తాగునీరు.. జర పట్టించుకోండి'

'వృథాగా తాగునీరు.. జర పట్టించుకోండి'

VKB: బహిరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందు తాగునీరు వృథాగా పోతున్నాయని స్థానిక మహిళలు చెప్పారు. పక్కనే ట్యాంక్ ఉన్నా అది లీక్ అవుతున్నందున అందులో నీళ్లు వదలడం లేదని తెలిపారు. వృథాగా పోతున్న నీరు కాలినడకన వెళ్తున్న వారికి ఇబ్బందికరంగా మారుతోందని వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.