VIDEO: ట్రాఫిక్ పోలీసుల విస్తృత తనిఖీలు
KNR: పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు నగర ట్రాఫిక్ పోలీసులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తెలంగాణ చౌక్ వద్ద పోలీసులు భారీగా మోహరించి, కార్లపై భారీ చలాన్లు, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, ద్విచక్ర వాహనాల చలాన్లను తనిఖీ చేశారు. వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్లను తక్షణమే క్లియర్ చేసుకోవాలని పోలీసు అధికారులు వాహనదారులకు సూచించారు.