సామాజిక సేవకురాలికి గిడుగు రామ్మూర్తి అవార్డు

NLG: కనగల్‌కు చెందిన గ్రామీణ వైద్యురాలు, సామాజిక సేవకురాలు కంబాల శివ లీల గిడుగు రామ్మూర్తి అవార్డును అందుకున్నారు. మంగళవారం విజయవాడలోని ఆశాష్ స్టూడియోలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తెలుగు రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారు ఆమెకు ఈ అవార్డును అందించారు. సంస్థ నిర్వాహకులు, పలువురు కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.