నేడు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్
కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యధావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అర్జీదారులు 1100 కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకుని తమ అర్జీల పరిష్కార స్థితిగతులను తెలుసుకోవచ్చని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.