'ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి'

BHNG: ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన 54 అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హనుమంత రావు ఆదేశించారు. జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభా రాణి, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.