పెనుకొండలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

పెనుకొండలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

సత్యసాయి: పెనుకొండ మండలంలోని శాఖా గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. నెహ్రూ జయంతి సందర్భంగా మండల గ్రంధాలయాధికారి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తొలి ప్రధానిగా ఆయన చేసిన సేవలు వివరించారు. అనంతరం పిల్లలతో గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించారు.