పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

KMR: వర్షాల వల్ల నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్‌తో కలిసి పరిశీలించారు.