రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో పాటు యాసంగి సాగు పెరగడం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఈనెల 3వ తేదీన రాష్ట్రంలో మొత్తం విద్యుత్ డిమాండ్ 18,139 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు నమోదు చేసింది. అదే సమయంలో TGSPDCL పరిధిలో ఇవాళ గరిష్ట డిమాండ్ 11,129 మెగావాట్లు నమోదైంది. గతేడాది ఇదే రోజున ఈ డిమాండ్ 10,310 మెగావాట్లుగా ఉండగా, ఈసారి గణనీయంగా పెరగడం విశేషం.