వెలుగొండ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రి
ప్రకాశం: దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్ట్ అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో కలిసి రెండో సొరంగం లోపలికి వెళ్లి అక్కడి పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎరిక్షన్ బాబు ఉన్నారు.