గాంధీజీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ కృషి

ప్రకాశం: ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగానే స్వాతంత్రం సిద్ధించిందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ చేసిన కృషి అనిర్వచనీయమన్నారు.