ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

W.G: టంగుటూరి ప్రకాశం పంతులు గొప్ప దేశ భక్తుడని, స్వాతంత్య్ర సమరయోధుడని తణుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ డా.దొమ్మేటి సుధాకరరావు అన్నారు. ప్రకాశం పంతులు 154వ జయంతి సందర్భంగా తణుకు మున్సిపల్ పార్క్‌లోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి, ఆయన పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కౌరు వెంకటేశ్వర్లు, కోట రామ ప్రసాద్, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.