విశాఖ-కేరళ మధ్య 20 ప్రత్యేక రైళ్లు

విశాఖ-కేరళ మధ్య 20 ప్రత్యేక రైళ్లు

VSP: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం-కేరళలోని కొల్లం మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈనెల 18 నుంచి జనవరి 21 వరకు ప్రతి మంగళవారం విశాఖ-కొల్లం (08539), ప్రతి బుధవారం కొల్లం-విశాఖపట్నం (08540) రైళ్లు నడుస్తాయని తెలిపింది. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ బోగీలతో ఈప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.