రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

W.G: నరసాపురం టౌన్ మత్స్యపురి బ్రిడ్జి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. చినమామిడిపల్లికి చెందిన కావలి సత్యనారాయణ (70) తన బైక్‌పై మార్కెట్‌కు వెళ్తుండగా, వెనుక నుంచి బైక్ బలంగా ఢీకొట్టింది. బాధితుడిని భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుమారుడు యేసు బాబు నరసాపురం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.