పరీక్షా పే చర్చ.. రిజిస్ట్రేషన్ చేసుకోండి!
ప్రధాని మోదీ విద్యార్థులతో నిర్వహించే ఇంటరాక్టివ్ కార్యక్రమం పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్ కోసం రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు జనవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Innovaindia1.MYGOV.IN ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించిన నిర్వహణ తేదీని ఇంకా ప్రకటించలేదు.