13మంది రైతులకు రూ.7లక్షల రుణాలు పంపిణీ
ASR: కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని హుకుంపేట పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్ దాస్ రైతులకు సూచించారు. శుక్రవారం పీఏసీఎస్ సభ్యులైన 13మంది రైతులకు పీఏసీఎస్ డైరెక్టర్ దాసన్న, కొట్నాపల్లి ఎంపీటీసీ బాలకృష్ణతో కలిసి రూ.7లక్షల రుణాలు పంపిణీ చేశారు. వ్యవసాయ పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రుణాలు పంపిణీ చేస్తున్నామన్నారు.