VIDEO: వెంకట్రాంపురంలో పాముల కలకలం
SRPT: అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామం 10వ వార్డు లోని ఇందిరమ్మ కాలనీలో పాముల సంచారం పెరగడంతో ప్రజలు భయపడుతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక ఇంటి వద్ద పాములు కనిపిస్తుండటంతో స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఖాళీ స్థలాలు, చెట్లు, పొదలను యజమానులు వెంటనే శుభ్రపరచాలని కాలనీవాసులు కోరుతున్నారు.