ఫిర్యాదులకు తక్షణమే న్యాయం చేయాలి: ఎస్పీ

ఫిర్యాదులకు తక్షణమే న్యాయం చేయాలి: ఎస్పీ

సత్యసాయి: ఫిర్యాదులకు తక్షణమే న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశించారు. సోమవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 63 ఫిర్యాదులను స్వీకరించారు.