రహదారిపై నీటి నిల్వలు.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

రహదారిపై నీటి నిల్వలు.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

BDK: పినపాక మండల పరిధిలోగల భూపాలపట్నం ఈ బయ్యారం ప్రధాన రహదారిపైన నీరు నిలిచి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భూపాలపట్నం గ్రామపంచాయతీలో పలు ఇళ్ళ ముందు నీరు నిలిచి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి గుండానే ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయానికి, పలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదన్నారు.