పాలకుర్తిలో ఆయుష్ మెగా వైద్య శిబిరం
JN: పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో CHC సూపరింటెండెంట్ పరమేశ్వరి ఆధ్వర్యంలో ఆయుష్ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జనగామ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం సభ్యులు దీర్ఘకాలిక వ్యాధులతో పాటు సీజనల్‌గా వచ్చు రోగాలకు 600 మందికి చికిత్స అందించారు. పలువురికి మెరుగైన చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఉషా పాల్గొన్నారు.